వివాదాస్పద నిర్ణయం తీసుకున్న జగన్, సొంత పార్టీలో అసహనం…!

-

ఒకపక్క కరోనా వైరస్ దెబ్బకు రాష్ట్ర ప్రజలు భయ పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న సంగతి అందరికీ అర్థమవుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 15 కేసులు బయటపడటంతో అసలు రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది..? అనే భయం నెలకొంది.

కానీ ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. కేవలం మీడియా లో మాత్రమే హడావుడి చేస్తోంది అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. కరోనా వైరస్ తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇళ్ల పట్టాల మీద హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ కి వెళ్ళాలి అని భావించడం పై సొంత పార్టీలో కూడా జగన్ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

ఈనెల 15 నుంచి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావిస్తున్న వైఎస్ జగన్… హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తాము ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలంలో కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తోంది అంటూ ఒక జీవోను కూడా విడుదల చేసి జగన్ సర్కారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారు..? అంటూ పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news