రివ్యూయర్స్ పై దేవా కట్టా ఏం చేప్పాడు..!

-

ఈమధ్య కాలంలో సినిమా ఫలితాలు రివ్యూయర్స్ రేటింగ్స్ మీదే ఆధారపడ్డాయన్న టాక్ బాగా వచ్చింది. హిట్టైన సినిమాకు రివ్యూస్ బాగున్నా బాగా లేకున్నా పట్టించుకోరు కాని రివ్యూస్ మంచిగా రాక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అదేదో రివ్యూస్ నెగటివ్ గా రాసినందువల్లే సినిమా పోయింది అన్నట్టుగా మాట్లాడేస్తారు.

అసలు విషయం సినిమాలో లేనిది రివ్యూస్ రేటింగ్ ఇచ్చినా లేకున్నా ఆడదు. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే రివ్యూస్ నెగటివ్ గా వచ్చినా సినిమా ఆడేస్తుంది. ఈ లాజిక్ దర్శక నిర్మాతలకు తెలుసు కాని వారు అది ఒప్పుకోరు. రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయిన గీతా గోవిందం సినిమాకు రివ్యూయర్స్ కూడా బాగుందని రాశారు.. మంచి రేటింగ్ ఇచ్చారు. రివ్యూయర్స్ పై వెన్నెల, ప్రస్థానం సినిమాల దర్శకుడు దేవాకట్టా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.

సినిమా రివ్యూలు రాసేవారికి అది ఓ వృత్తి అని.. సినిమా దర్శకులు ఎలా సినిమా తీస్తారో అలా రివ్యూయర్స్ రివ్యూస్ రాస్తారని. భిన్న అంశాల మీద హక్కు ఉందని సినిమా వాళ్లు ఎలా చెబుతారో.. అలానే ఓ సినిమాను విమర్శించే హక్కు రివ్యూయర్స్ కు ఉందని అన్నారు దేవా కట్టా. ఓ రకంగా సమీక్షకుడే మొదటి ప్రేక్షకుడని రివ్యూ కింద బాటం లైన్ గా ఇది రివ్యూయర్ యొక్క అభిప్రాయమే అని పెడతాడు. అందుకే రివ్యూయర్లు ప్రేక్షకులు వేరు కాదని అంటున్నాడు దేవాకట్ట.

Read more RELATED
Recommended to you

Latest news