ఏపీ, తెలంగాణాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే విపక్షాలు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేసారు.
“విశాఖ లో హుదూద్, శ్రీకాకుళంలో తిత్లీ వస్తే చంద్రబాబు రోజుల తరబడి అక్కడే ప్రజల మధ్య ఉండి పని చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తి ప్రజలను కడగండ్ల పాలు చేసినా జగన్ రెడ్డి తాడేపల్లి రాజ ప్రసాదం వదిలి బయటకు రావడం లేదు. సీటు దక్కిన తర్వాత వారంతా అంటరాని వారయ్యారా?” అని ఆయన ప్రశ్నించారు.