కార్మికులకు జగన్ గుడ్ న్యూస్..భారీగా వేతనాల పెంపు..

-

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో పథకాలను అందించారు.ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన పథకాల ద్వారా చాలా మంది లబ్ది పొందారు.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పారు.ఏపీ లోని మున్సిపాల్టీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు ఓహెచ్ఏకు సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది..

మున్సిపల్ కార్మికుల 15 వేల వేతనానికి అదనంగా 6 వేలు ఓ హెచ్ ఏను ప్రభుత్వం చెల్లించనునుంది. దాంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ. 21 వేలకు పెరిగినట్టయింది. తాజా ఉత్తర్వుల తో 43 వేల మందికి పైగా కార్మికులకు లబ్ది చేకూరుతుంది. ఈ ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కార్మికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు..

మొన్నీమధ్య ఏపీలో మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పలు డిమాండ్‌ల తో సమ్మెకు దిగారు. తమ జీతాలు పెంచాలంటూ మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్య భృతిని కూడా తమ డిమాండ్లలో కార్మికులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులతో మంత్రుల కమిటీ చర్చలు జరిపింది.

అయితే, కొన్ని చర్చల అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఆదేశించడం.. కేబినెట్‌ కమిటీ ద్వారా సమస్య పరిష్కారం త్వరగతిన పూర్తైంది..అదే విధంగా 233 జీవో ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.. భవిష్యత్తు లో మరిన్ని పథకాలను అందించనున్నట్లు వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Latest news