ఇప్పటికే విశాఖకు రాజధాని ప్రకటించిన ఏపీ సిఎం జగన్ విశాఖకు మరో శుభవార్త వినిపించారు. విశాఖలో ఐటీకి ఊతం ఇచ్చే విధంగా జగన్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. విశాఖ లో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్క్‌లో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్ ఆఫీసు, స్టేట్ డేటా సెంటర్, ఐటీ టవర్స్ వంటి సదుపాయాలు అందులో ఉండనున్నాయి.
.అలానే విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. రోబోటిక్స్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ మరియు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధనలకు ఈ యూనివర్సిటీ కేంద్రం కానుంది. అలానే విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేయాలనీ కూడా నిర్ణయించినట్టు చెబుతున్నారు.