ఏబీ వెంకటేశ్వర రావుకు మరో షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్

-

ఏపీ ఇంటెలిజన్స్ మాజీ చీఫ్.. ఏబీ వెంకటేశ్వర రావుపై నమోదు చేసిన కేసులో దర్యాప్తును ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఏబీవీపై ఉన్న అభియోగాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏబీవీ సస్పెన్షన్లో ఉన్నారు. ప్రభుత్వం పేర్కొన్న అభియోగాలపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.  సమాధానం ఇవ్వకుంటే అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అభియోగాలపై ప్రలోభాలు పెట్టినట్టు వెల్లడైనా చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో అంతర్గత భద్రతకు ముప్పు, పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డట్టు ఏ బి వెంకటేశ్వరవు పై అభియోగాలు నమోదయ్యాయి. ఏ బి వెంకటేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు చైతన్య కృష్ణ పైన ఆరోపణలు వచ్చాయి. మొత్తం అభియోగాలు, ఆరోపణలుసి, ఆధారాలన్నింటిని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news