ఫేస్ బుక్ లో కొత్త వారితో మాట్లాడుతున్నారా ? తస్మాత్ జాగ్రత్త. !

-

ఫేస్ బుక్ ప్రేమ పేరుతో 5 లక్షలకు టోకరా వేశారు సైబర్ నేరగాళ్ళు. ఫేస్ బుక్ లో ఒక విదేశీ అమ్మాయి పేరిట ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, నెమ్మదిగా అది ప్రేమ దాకా వెళ్ళింది. చివరకి 5.1 లక్షల రూపాయలు మోసం చేశారు సైబర్ కేటుగాళ్ళు. వివరాల్లోకి వెళ్తే ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో హైదరాబాద్ కి చెందిన ముస్తఫా అనే వ్యక్తికి వల విసిరారు సైబర్ నేరగాళ్ళు.

2 కోట్ల రూపాయల యూకే కరెన్సీ బాగమతి పంపిస్తున్నానని నమ్మించిన కేటుగాళ్ళు, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముస్తఫా కి ఫోన్ వచ్చినట్టు నమ్మించారు.  2 కోట్ల యూకే కరెన్సీ వచ్చిందని.. అందుకు గాను కస్టమ్, జిఎస్టీ, ఇతర చార్జీల పేరుతో 5.1 లక్షలు చెల్లించాలని చీటర్స్ కోరారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ అన్నటు బిల్డప్ ఇవ్వడంతో అది నమ్మిన ముస్తఫా ఆన్లైన్ ద్వారా 5.1 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఎంతకూ 2 కోట్లు రాకపోవడంతో పాటు ఫేస్ బుక్ లో సదరు లవర్ బ్లాక్ చేయడంతో మోసపోయానని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news