వైఎస్సార్ బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు వేశారు. 2020 అక్టోబర్ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు అనుకోని విపత్తుగా ఇంటి పెద్దను కోల్పోయిన 12,039 కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం అమలు కానుంది. అంతమంది లబ్ధిదారుల ఖాతాలో రూ. 254 కోట్లు నేరుగా సీఎం నగదును బదిలీ చేశారు.
జిల్లాల నుంచి వర్చువల్ విధానంలో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 510కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు.. కోటి 41 లక్షల మందికి లబ్ది చేకూరనుందని చెబుతున్నారు. అయితే వైఎస్సార్ భీమా పథకంలో లబ్దీ పొందాలంటే వారికి వయసుతో నింబంధనలు ఉంటాయి. ఈ పథకం ద్వారా 18 నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తులు ప్రమాదంలో చనిపోయిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి 5లక్షలు, సాధారణ మరణానికి 30 వేలు పరిహారం ఇవ్వనున్నారు.