ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లా, గుంటూరు జిల్లా. దీంతో ప్రస్తుతం రాజధాని ప్రాంతం పరిధిలో జరుగుతున్న అమరావతి నిరాహార దీక్షలకు, ఆందోళనలకు, నిరసనలకు రైతులకు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలుపుతూనే ఉన్నారు. అధికార వికేంద్రీకరణ పేరిట జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని కన్నా లక్ష్మీనారాయణ వ్యతిరేకించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజధాని ప్రాంత పరిధిలో రైతులు చేస్తున్న దీక్షలో మాట్లాడుతూ తమది మాటమీద నిలబడే పార్టీ అంటూ కన్నా బిజెపి పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ మీడియా కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని అసలు 2019 బిజెపి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడు కన్నా లక్ష్మీనారాయణ అంటూ సవాలు విసిరింది. నిజంగా మాటమీద నిలబడే బిజెపి పార్టీ అయితే గతంలో కర్నూలులో ఎందుకు హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అని ప్రశ్నించింది.
ఇదే తరుణంలో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పార్టీ మరియు చంద్రబాబు కలిపి రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేశారు అంటూ ఒకే దెబ్బతో ఇరికించే విధంగా కథనాలు ప్రసారం చేసింది జగన్ మీడియా. ప్రజల ముందు మాయ మాటలు చెప్పటం ఎన్నికల సమయంలో మాత్రం మేనిఫెస్టోలో వేరే హామీలు ఇవ్వడం దేనికయ్యా ఇటువంటి రాజకీయాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం నీ పబ్బం గడుపుకోవడం కోసం అమరావతి లో ఉంటావ్ కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటూ కన్నా లక్ష్మీనారాయణ గాలి తీసేసింది జగన్ మీడియా.