బ్రేకింగ్; మళ్ళీ ఎన్నికలకు రెడీ అయిన జగన్, తేదీలు ఇవే…!

-

రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ స్పష్టత ఇవ్వడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల కోసం సిద్దమైంది. మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికలను నెల రోజుల్లోగా పూర్తి చెయ్యాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సిద్దమవుతుంది. రిజర్వేషన్ లను కుదించడానికి సిద్దమైంది.

నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఇందుకు సంబంధించి పలు తేదీలను ప్రతిపాదించింది. మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, మార్చి 10న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మార్చి 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.

మార్చి 24వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికలు, మార్చి 27న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చింది. సుప్రీం కోర్ట్ మార్గ దర్శకాల ప్రకార౦ 50 శాతం రిజర్వేషన్ లు మించరాదు. త్వరలోనే రిజర్వేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news