జగన్‌కు త‌ల‌నొప్పిగా మారిన నెల్లూరు వర్గ విబేధాలు.. నేడు నేతలతో పంచాయతీ

-

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. దీంతో విష‌యం తెలుసుకున్న‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నెల్లూరు జిల్లా నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుపై సీరియస్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే బుధవారం సాయంత్రం క్యాంప్‌ ఆఫీసులో నెల్లూరు నేతలతో సీఎం భేటీ కానున్నారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేతల మధ్య సమన్వయ లోపంపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి విష్ణువర్దన్‌రెడ్డి తీరుపై జగన్‌ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి తన ఇంటిపై దాడిచేశారని, దౌర్జన్యం చేశారని వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలపై ఐపీసీ సెక్షన్లు 290, 427, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీడీవోపై దాడి విషయాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. శ్రీధర్‌రెడ్డిపై వ్యతిరేకత‌ రావడంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

Read more RELATED
Recommended to you

Latest news