నేడే తాగండి టీడీపీ బీడీలు : ఫోటో వైరల్ – అసలు కథ ఇదీ ?

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫోటో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. తెలుగు దేశం బీడీలు.. అవును మీరు చదివింది నిజమే.. ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ నేతలు ఇక బీడీలు అమ్ముకుంటా బతకాల్సిందే అంటూ కొందరు దీనిపై కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేతలు డిసైడ్ అయ్యారని మరికొందరు అంటున్నారు.

అందుకే.. ఇలా బీడీల వ్యాపారానికి దిగారని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ రంగు పసుపులోనే ఈ బీడీ కట్టల ప్యాకెట్ ఉంది. దీనిపై తెలుగుదేశం బీడీలు అంటూ టైటిల్ ఉంది. తెలుగుదేశం పార్టీ గుర్తు అయిన ఇల్లు, నాగలి, కార్మిక చక్రం ఉన్న లోగో కూడా ఉంది. అసలే టీడీపీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి దిగాలుగా ఉంటే.. గోటిచుట్టుపై రోకటి పోటులా ఇలాంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పాపం.. తెలుగు దేశం పార్టీకి చాలా గడ్డు పరిస్థితి నడుస్తోంది. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు తన చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ లో ఘోర పరాజయం కారణంగా అధికారం కోల్పోతే ఇక తెలంగాణలో ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోటో వైరల్ గా మారుతోంది.

ఈ తెలుగుదేశం బీడీల ట్రేడ్ మార్కు కూడా ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ కావడం విశేషం. ఈ బీడీ ఫ్యాక్టరీ కడపలో ఉన్నట్టు ఆ ప్యాకెట్ కవర్ తెలియజేస్తోంది. అయితే తమ బీడీలకు తెలుగుదేశం పార్టీకీ ఏం సంబంధం లేదంటున్నారు ఆ ఫ్యాక్టరీ యజమానులు.. తమ బీడీల ఫ్యాక్టరీ 12 ఏళ్ల నుంచి ఉందని.. ఎన్టీఆర్ పై అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నామని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతోంది.