ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేసారు. ఆయన గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ ని కలిసి దీనిపై ఫిర్యాదు చేయడానికి సిద్దమయ్యారు. కాసేపటి క్రితం ఆయన గవర్నర్ ని కలిసారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం పై సీఎం ఆగ్రహంగా ఉన్నారు. ఈసీ ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసారు. దీనిపై ఆయన గవర్నర్ కి ఫిర్యాదు చేసారు.
అదే విధంగా ఎన్నికల్లో జరిగిన గొడవలు గురించి కూడా జగన్ గవర్నర్ కి వివరణ ఇచ్చినట్టు సమాచారం. అదే విధంగా రాష్ట్రలో శాంతి భద్రతలపై కూడా ఆయన చర్చలు జరిపినట్టు సమాచార౦. కాగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా అవేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా పలువురు అధికారులను కూడా ఫిర్యాదు చేసారు. ఇద్దరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులతో సహా పది మంది అధికారులను సస్పెండ్ చేసారు.