కరోనా అనుమానం వస్తే… జగన్ సంచలన నిర్ణయం…!

-

కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిన నేపధ్యంలో… కరోనా నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. కరోనా వైద్యానికి ప్రత్యేక నియంత్రణ ఉత్తర్వులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంది. 1897 చట్టాన్ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎపిడిమిక్ డీసీజెస్ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రభుత్వం ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించేలా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తున్న నేపధ్యంలో జగన్ సర్కార్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ధిక్కరించిన వారికి భారతీయ శిక్షా స్మృ తి‌లోని సెక్షన్ 188 ప్రకారం శిక్ష విధించే అధికారం ఉంటుంది. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉండదు.

ఎవరైనా రోగి వైద్యం తీసుకోవడానికి గాని, అది మరింత వ్యాప్తి చెందకుండా నిర్బంధంలోకి వెళ్ళడానికి నిరాకరించినా అటువంటి వారిని నిర్బంధంలోకి తీసుకుని చికిత్స అందించే అధికారం అధికారులకు ఉంటుంది. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు నుంచి 14 రోజుల వరకు రోగిని అదుపులో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఏపీ సరిహద్దున ఉన్న కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news