ఏపీ రాజకీయం దేవుళ్ళ చుట్టూ అలానే గుడుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఆలయాల అంశం మీద ఇప్పటి దాకా మౌనం దాల్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, రాజకీయాలకు దేవుడిని వాడుకుంటున్న తీరు ఆశ్చర్యం వేస్తోందని అన్నారు. దేవుడి విగ్రహం పగులగొడితే ఎవరి కి లాభం? భావోద్వేగాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? అని ఆయన ప్రశ్నించారు. ఎవరిని టార్గెట్ చేసి ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అని ఆయన ప్రశ్నించారు.
కలియుగం క్లైమాక్స్ లో ఉన్నామన్న ఆయన ఇది పొలిటికల్ గొరిల్లా వార్ ఫేర్ ఇటువంటి దాడులను, కుట్రలను ఎలా ఎదుర్కోవాలో పోలీసులు దృష్టి సారించాలని అన్నారు. చాలా దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో కూడాలేవన్న ఆయన మారుమూల ప్రాంతాల్లో, ఎవరూ లేని సమయంలో, అర్థరాత్రి పూట ఈ దాడులు జరగుతున్నాయని అన్నారు. 20 వేల దేవాలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టామని అన్నారు. టీడీపీ వాళ్ల యాజమాన్యాల్లో ఉన్న గుళ్లలో ఘటనలు జరిగిన వెంటనే సోషల్ మీడియా, ఎల్లో మీడియా ప్రజలను రెచ్చగొడుతున్నాయని రాజకీయంగా లాభం పొందాలనే కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి కుట్రలు చేస్తున్నాయని అన్నారు.