ఆ అధికారికి ట్రంప్‌ బెదిరింపు కాల్‌.. అందుకేనా?

-

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం సమయం దగ్గర పడుతున్న క్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఎన్నికల ఫలితాలపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారు. స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలో వెలుడిన ఫలితాల్లో తనకే అనుకూలంగా ప్రకటించాలని జార్జియా సెక్రటరీ బ్రాడ్‌ రఫెన్స్‌ జార్జ్‌ను కోరారు. వీరిద్దరు మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు రావడంతో సంచలనం రేగుతుంది. తనకు ఎక్కువ ఓట్లు వచ్చిట్లు చెప్పకపోతే క్రిమినల్‌ కేసులు నమొదు చేయిస్తానని రిపబ్లిక్‌ బ్రాడ్‌ను ఆడియో కాల్‌ లో హెచ్చరించారు.

క్రిమినల్‌ కేసులు పెట్టిస్తా..

” జార్జియాలో మేము ఓడిపోయే ప్రసక్తే లేదు, వేలల్లో మెజార్టీ వస్తుంది. జార్జియా ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అధ్యక్షుడికి వ్యతిరేకంగా పని చేయరాదు. నేను చెప్పిందే చేయాల్సింది. నాకు 11,780 ఓట్లు వచ్చాయని మీరే చెప్పండి. అక్కడ మాకు అంతకంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. మా పార్టీకి, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే పెద్ద రిస్క్‌ తీసుకున్నవారవుతారు. మీతోపాటు మీ లాయర్‌ రేయన్‌ క్రిమినల్స్‌ ఎఫెన్స్‌ ఎదుర్కొవాల్సి వస్తోంది. అందుకే మీరు నేనే చెప్పినట్లుగా చేస్తే ఎలాంటి సమస్య ఉండదని” ఆ ఆడియో కాల్‌లో హెచ్చరించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది.

బ్రాడ్‌ తనదైన శైలిలో..

బ్రాడ్‌ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. జార్జియాలో ఓట్ల లెక్కింపు మాత్రం సవ్యంగా జరిగిందని జో బైడెన్‌కు 11,779 ఓట్లు వచ్చి విజయం సా«ధించారని దీటుగా సమాధానం ఇచ్చారు. ట్రంప్‌ మాట్లాడిన తీరును డెమొక్రాట్లు ఖండించి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నికల్లోనూ నెగ్గిన బైడెన్‌కు ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుంటే.. ట్రంప్‌ మాత్రం ఓడిన నాటి నుంచి తనదే గెలుపని ఫలితాల్లో అవకతవకలు జరిగాయని డెమొక్రాట్లపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news