ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నా సరే కొందరు ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్క కేసులు పెరుగుతున్నా సరే కరోనా ఉన్న సమయంలో కార్యక్రమాలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తుంది. రాజకీయంగా మైలేజ్ కోసం ప్రచారం చేసుకునే వైసీపీ నేతల మీద ఆయన ప్రత్యేక దృష్టి సారించారు అనే వార్తలు వస్తున్నాయి. నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ సహా మరి కొందరి మీద చర్యలకు సిద్దమైనట్టు తెలుస్తుంది.
ఒక పక్క రోజు రోజుకి కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపధ్యంలో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ జనాలను ఒక చోటకు తీసుకుని రావాలి అని భావించడం తో కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికార పార్టీ ఇబ్బంది పడుతుంది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు జగన్ కి ఇబ్బంది గా మారాయి. దీనితో వారి మీద చర్యలకు సిద్దమవుతున్నారు సిఎం. వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని వారి మీద కేసులు కూడా పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన దీనికి సంబంధించిన నివేదిక కూడా అడిగినట్టు సమాచారం.
వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్న చోట ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు చేసిన తర్వాత ఎన్ని కేసులు పెరిగాయి అనే దాని మీద ఆరా తీస్తున్నట్టు సమాచారం, నగిరి ఎమ్మెల్యే రోజా కు జగన్ ఇప్పటికే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన కార్యక్రమం పై కేంద్రం కూడా సీరియస్ అయింది. ప్రజల ప్రాణాల కంటే ఈ కార్యక్రమాలు ముఖ్యమా అని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ప్రధాని కార్యాలయ అధికారులు డీజీపీ కి కూడా ఫోన్ చేసినట్టు సమాచారం.