సీనియర్ అధికారులు మంత్రులపై వేటు వేయడానికి రెడీ అయిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇంకా ఆగ్రహం గానే ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ,రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఎన్నికలను వాయిదా వేసే ముందు ఎన్నికల సంఘం సమాచారం ఇవ్వలేదు.

దీనితో ఆగ్రహంగా ఉన్న జగన్ ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్ ని మాత్రం కొనసాగించ వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కనీసం పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీలు కూడా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అసలు ఏం జరుగుతుందో పసిగట్టలేని స్థితిలో ఎంపీలు ఉన్నారని జగన్ అసహనం గా ఉన్నారట.

ఇక విజయ సాయి రెడ్డి తీరుపై కూడా జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి కూడా జగన్ కేవలం పార్టీలో తనకు సన్నిహితంగా ఉన్న వారిని కొంతమంది సీనియర్ మంత్రులను మాత్రమే కలుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటో తెలియదు కానీ జగన్ త్వరలోనే ఢిల్లీకి వెళ్తారని ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కొంతమంది అధికారులపై అదేవిధంగా మంత్రులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకునే వాళ్ళ పేర్లను కూడా జగన్ కొంతమంది వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. తాడేపల్లి లోని తన నివాసం వద్దకు కొంతమంది నేతలు వచ్చినా… ఆయన కనీసం మాట్లాడటం లేదని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news