వైసీపీ నేతల్లో కొత్త భయం… ఇప్పుడు ఏం చెయ్యాలి…?

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం ఏమోగానీ ఇప్పుడు కొందరు వైసీపీ నేతల్లో మాత్రం కొత్త భయం పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీలు దాదాపుగా 22% ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ ఏకగ్రీవమైన స్థానాలను ఎన్నికల సంఘం రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

ఆయా స్థానాల్లో ప్రత్యర్ధులు బలవంతపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అదేవిధంగా నామినేషన్ వేసిన చోట వైసీపీ నేతలు ఇతరుల నామినేషన్ విత్ డ్రా చేయించారని ఆ ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా అందినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను పిలిచి మాట్లాడే అవకాశం ఉందని, అదే విధంగా మీడియా కు వచ్చిన వీడియోలు ఎన్నికల సంఘం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఎన్నికల సంఘం ఏకగ్రీవమైన స్థానాలను రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. వీటిపై త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు భయం మొదలైంది. అన్ని విధాలుగా కష్టపడి ఏకగ్రీవం చేస్తే ఇప్పుడు ఆ ఎన్నికను రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పటం చెప్పడం భావ్యం కాదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల పార్టీ ఇన్చార్జి కూడా భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.’

Read more RELATED
Recommended to you

Latest news