బిగ్ బ్రేకింగ్  డిల్లీ కూడా ఉలిక్కిపడే రికార్డ్ కొట్టేసిన జగన్ .. !!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన పట్ల ప్రజలకు మంచి పాజిటివ్ అభిప్రాయం నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం నుండి నేరుగా పథకాలు డైరెక్టుగా తమ ఇంటి గడప దగ్గరకు రావడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డబ్బు రూపంలో డైరెక్ట్ అకౌంట్ లోకి జమ అవుతున్న నేపథ్యంలో జగన్ నిర్ణయాలకు జనాలు జై కొడుతున్నారు. గతంలో ప్రజలకు మరియు ప్రభుత్వాలకు మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న క్రమంలో చాలా వరకు ప్రభుత్వ పథకాలు సరైన వ్యక్తి కి అందేవి కాదనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు జగన్ అందిస్తున్న నేపథ్యంలో జగన్ పాలన పై మంచి అభిప్రాయం ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది. ఇటువంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో చాలా చోట్ల ఏకగ్రీవ స్థానాలు వైసీపీ దక్కించుకోవడం జరిగింది.  ఏఏ జిల్లాలో వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవం అయిందో ఒకసారి తెలుసుకుందాం. Image result for jagan record

శ్రీకాకుళం: 667 ఎంపీటీసీ స్థానాలకు గాను 48 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 3 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

విశాఖ: 39 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక చోట వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం 

తూర్పు గోదావరి : 1088 ఎంపీటీసీ స్థానాలను గాను 40 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

పశ్చిమ గోదావరి: ఏలూరు రూరల్‌ జెడ్పీటీసీ అబ్యర్థి సరస్వతి ఏకగ్రీవం.

 కృష్ణా జిల్లా: 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను రెండు చోట్ల ఏకగ్రీవం

గుంటూరు జిల్లా: 54 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు 8 చోట్ల ఏకగ్రీవం

ప్రకాశం జిల్లా: 55 జెడ్పీటీసీ స్థానాలకు గాను 11 చోట్ల వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

నెల్లూరు: 46 జెడ్పీటీసీ గాను  వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 12 చోట్ల ఏకగ్రీవం

చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 15 చోట్ల ఏకగ్రీవం..858 ఎంపీటీసీ స్థానాలకు గాను 225 చోట్ల ఏకగ్రీవం

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 95 ఎంపీటీసీ స్థానాలకు గాను 86 చోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

వైయస్‌ఆర్‌ జిల్లా: 50 జెడ్పీటీసీ గాను 35 చోట్ల , 805 ఎంపీటీసీ 150 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

అనంతపురం: 841 ఎంపీటీసీ స్థానాలకు గాను వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు 41 చోట్ల ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

మొత్తంమీద చూసుకుంటే ప్రభుత్వం స్థాపించి ఇంత తక్కువ టైంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని స్థానాలు గెలవలేదని ఇది ఢిల్లీ కూడా ఉలికిపడే రికార్డు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

 

Read more RELATED
Recommended to you

Latest news