ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సోమవారం ఉదయం రమేష్ కుమార్… రాజభవన్ లో గవర్నర్ హరిచంద్ ని కలిసి ఎన్నికలను వాయిదా వేయడానికి గల కారణాలను వివరించారు. దీనికి గవర్నర్ ఏమన్నారు అనేది తెలియలేదు గాని, రమేష్ కుమార్ అక్కడి నుంచి వచ్చి బందరు రోడ్డులో తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
గవర్నర్ కి ఎం చెప్పింది ఆయన అధికారులకు స్పష్టంగా వివరించారు. త్వరలో దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలు కొనసాగీస్తూ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా… రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ ని జగన్ కలిసిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వం హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్ళారు. దీనితో కోర్ట్ లు ఎం చెప్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.