ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మోటారు వాహనాల పన్ను చట్టం -1963…లో సవరణలకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. వాహనాల లైఫ్ టాక్స్, గ్రీన్ టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ఇక పై…13,14,17,18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించేందుకు ప్రణాళికలు చేస్తోంది జగన్ సర్కార్.
టాక్సీలో పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా 410 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21 సంవత్సరం లలో.. రవాణా శాఖ కు మూడు వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే వాహనమిత్ర పేరుతో కొద్దిమందికే పథకం వర్తించింది. ఇక తాజా గా టాక్సీ పెంపు తో లక్షల మంది పై వంద కోట్ల భారం మోహన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీని పై ఇవాళ అసెంబ్లీలో సవరణలు చేసే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం అందించారు.