హైదరాబాద్ : భర్త మోసం చేశాడని ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య…!

ప్రేమించి పెళ్లాడిన భర్త మోసం చేశాడని ఓ ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…భద్రాచలం కు చెందిన గుణ అలియాస్ స్వప్న( ట్రాన్స్ వుమెన్) గత కొంతకాలంగా మీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో స్వప్న కు నల్గొండ జిల్లా నిడమానూరు కు చెందిన నిషాంత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. నిశాంత్ బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు.

Transzender commited suside
Transzender commited suside

వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో రెండు నెలల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. అయితే కొడుకు ట్రాన్స్ జెండర్ ను పెళ్లాడి ఆమెతో ఉంటున్నాడు అనే విషయం తల్లి దండ్రులకు తెలిసింది. దాంతో అతడిని గ్రామానికి పిలిపించి మళ్లీ హైదరాబాద్ పంపించలేదు. దాంతో స్వప్న నిషాంత్ ఊరుకు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంతో ను పోలీస్ స్టేషన్ కు రప్పించగా అతడు స్వప్న అంటే ఇష్టం లేదని చెప్పాడు. దాంతో మనస్తాపానికి గురైన స్వప్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.