పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసిన కేంద్రం..!

-

పెన్షనర్లకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ ని చెప్పింది. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. అయితే దీనితో పెన్షనర్లకు రిలీఫ్ వచ్చింది అనే చెప్పాలి. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం జాయింట్ అకౌంట్ అంశం పై మరో సారి స్పష్టతనిచ్చింది.

money
money

జీవిత భాగస్వామి పెన్షన్ ని తీసుకోవడానికి జాయింట్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యక్కర్లేదు అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. రిటైర్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామి తో జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చెయ్యడం అవ్వదు అని కార్యాలయ అధిపతి సంతృప్తి చెందితే ఈ నిబంధన సడలించవచ్చని ఆయన అన్నారు.

పెన్షన్ డిపార్ట్‌మెంట్‌ తో సమావేశం అయ్యాక ఈ విషయాన్ని చెప్పారు. ఫ్యామిలీ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షన్ కోసం పాత జాయింట్ అకౌంట్‌ను అందిస్తే కనుక కేంద్ర ప్రభుత్వపు పెన్షన్ పంపిణీ చేస్తున్న బ్యాంకులన్నీ పాత అకౌంట్‌ను తిరస్కరించొద్దని.. కొత్త ఖాతాని ఓపెన్ చెయ్యమని ఫోర్స్ చెయ్యద్దని అన్నారు. పెన్షన్ పొందే వారు జాయింట్ అకౌంట్ కలిగి ఉండాలి. అప్పుడే పెన్షన్ పంపిణీ లో జాప్యం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news