ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇన్నాళ్ళు క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు రెండు వేలు ఇవ్వాలని ఆదేశించారు. కరోనా వైరస్ పై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో లాక్ డౌన్ పెంపు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కరోనా కేసులు, వైద్యుల భద్రత, టెస్ట్ కిట్స్ ఇలా కొన్ని వాటి గురించి ఆయన అధికారుల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా జగన్ పలు విషయాలను ఆరా తీసారు. ఇక ఇన్ని రోజులు క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు ఆర్ధిక సహాయం చెయ్యాలని అధికారులను ఆదేశించారు జగన్. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై ఆయన ఆరా తీసారు. బాధితులకు డబుల్, సింగిల్ రూమ్ ఇస్తున్నామని అధికారులు చెప్పగా… క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లేవాళ్లకు రూ.2వేలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇంటికి వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలని సూచించారు. అరటి, పుచ్చ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిసారించాలని, రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జగన్… నూనెల ధరలపై దృష్టి పెట్టాలని, ధరలు పెరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చెయ్యాలి అన్నారు.