ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయడం ఏమో గాని ఇప్పుడు అధికార వైసీపీలో మాత్రం ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఉన్నపళంగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం వెల్లడించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల సంఘంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ విధంగా తమకు చెప్పకుండా వాయిదా వేస్తారని నిలదీశారు.
ఇక ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ౦లో కూడా అలజడి రేపింది. కనీసం ప్రధాన కార్యదర్శికి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి నిఘా విభాగం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే కనీసం పసిగట్టలేకపోయారా అని జగన్ నిఘా విభాగం అధినేత మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
తనకు కనీసం ఏ సమాచారం లేదని, మీరు ఉండి ఎం చేస్తున్నారని వారితో సమావేశం అయిన సందర్భంగా జగన్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. “‘ఇంత ఇంపార్టెంట్ మేటర్ గుర్తించలేకపోతే ఇంక మీరెందుకు? ఈ వ్యవస్థ ఎందుకు?” అని వారిని ప్రశ్నించారట.ఇక ఈ వ్యవహారంతో కేంద్ర౦ పెత్తనం రాష్ట్రంలో ఉందని అర్ధమైంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎస్ఈసీ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.