చంద్రబాబుకి ధ్రువ సినిమా చూపిస్తున్న జగన్…!

-

ఈ విధంగా ముందుకి వెళ్ళాలి, ప్రజా చైతన్య యాత్రను ఈ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలి. రాజకీయంగా బలపడటానికి ముందు ఈ జిల్లా నుంచి టార్గెట్ చెయ్యాలి. ఉన్న ఎమ్మెల్యేలకు ఈ సూచనలు ఇవ్వాలి. ఎమ్మెల్సీలు ఈ విధంగా వ్యవహరించాలి. పలానా వాళ్ళు మీడియా సమావేశం పెట్టి ఇవి మాట్లాడాలి… టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు ఎం చెప్తున్నారో…? ఏ వ్యూహాలను పార్టీ కోసం సిద్దం చేస్తున్నారో…?

ప్రతీ వ్యూహం కూడా ముందే జగన్ కి తెలుస్తుంది. పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలకు సమాచారం వెళ్ళే లోపే చంద్రబాబు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వెళ్లిపోతుంది. చంద్రబాబు ఎం మాట్లాడుతున్నారు ఎం చర్చిస్తున్నారు అనేది జగన్ లైవ్ లో వింటున్నారు. సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతీ మాటా కూడా… చంద్రబాబుకి అత్యంత సమీపం నుంచి జగన్ కి క్లియర్ ఆడియో తో వెళ్తుంది.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు అయినా ఇప్పుడు విపక్షంలో ఉన్నా సరే జగన్ ఆయన్ను వదలడం లేదు. ప్రతీ చిన్న అడుగుని జగన్ తెలుసుకుంటున్నారు. చంద్రబాబు భవిష్యత్తులో ఎం చేస్తున్నారు… ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారు. ఆయన ఎప్పుడు ఏ పర్యటనలు చెయ్యాలి అనుకుంటున్నారు…? ఎమ్మెల్యేలకు పార్టీ నుంచి అందేవి ఏంటీ…? ఇవి అన్నీ జగన్ స్పష్టంగా తెలుసుకుంటున్నారు.

రాజకీయంగా చంద్రబాబుని జగన్ ప్రశాంతంగా ఉండనీయడం లేదు. మీడియా సమావేశాల్లో నేతలకు ఇచ్చే సూచనలు కూడా కోవర్ట్ లు జగన్ కి మోస్తున్నారు. పక్కా సమాచారం ఇస్తూ చంద్రబాబుకి ధ్రువ సినిమా చూపిస్తున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలి అనే దాని మీద చంద్రబాబు అనేక విధాలుగా కసరత్తులు చేస్తున్నారు. అయినా సరే ప్రయోజనం శూన్యం. మరి దీని నుంచి పార్టీ ఎప్పుడు బయటపడుతుందో…?

Read more RELATED
Recommended to you

Latest news