కడపలో ఇటీవల జరిగిన పేలుళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. పేలుడు ప్రమాదంలో 10 మంది మృత్యువాత ఘటనాలో వైసీపీ నాయకులపై టీడీపీ విమర్శలు చేసింది. క్వారీ యజమాని నాగేశ్వరెడ్డి తో పాటు ఐదుగురి పై కేసు నమోదు చేసారు పోలీసులు. పులివెందుల ప్రాంతం నుండి తరలించిన పేలుడు బ్లాస్టింగ్ మందుల లైసెన్స్, ఇతర నిబంధనలపై పోలీసు అధికారులు విచారణ మొదలుపెట్టారు.
మైనింగ్ లో మొత్తం నిభంధనలు ఉల్లంఘించినట్లు, క్వారీ యాజమాన్యం నిర్లక్షమే ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన కలెక్టర్ హరికిరణ్ నివేదిక ఇచ్చారు. దీనిపై సిఎం వైఎస్ జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అని తెలిసింది. అధికారులతో ఆయన నేరుగా మాట్లాడుతున్నారు అని సమాచారం.