ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకపక్క ఎన్నికల సమయంలో మరియు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మరోపక్క అదే సమయంలో రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి ఓకే రేంజ్ లో ఉండేలా పరిపాలన చేస్తున్న జగన్ కి దేశ వ్యాప్తం బెస్ట్ సీఎం లలో మూడవ స్థానం దక్కింది. ఇటువంటి నేపథ్యంలో తొమ్మిది నెలల జగన్ పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అయితే తాజాగా మాత్రం వైయస్ జగన్ తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా టార్గెట్ చేశారని రివేంజ్ డ్రామా మొదలు పెట్టారని ఇక ఒక్కొక్కడికి రాజకీయంగా ప్యాకప్ అయిపోవటం గ్యారెంటీ అనే వార్తలు ఏపీ మీడియాలో బలంగా వినబడుతున్నాయి.
ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మొత్తం బయట పెట్టడానికి 10 మంది సభ్యులతో కలిపి సిట్ కూడా ఏర్పాటు చేశారు. కాగా ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు తాజాగా ఈఎస్ఐ కుంభకోణం బయటపడటంతో ఈ రెండు విషయాలలో జగన్ ఏర్పాటు చేసిన సిట్ పక్కా కీలక ఆధారాలు సేకరించినట్లు కచ్చితంగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు జైలుకెళ్లడం గ్యారెంటీ అని టాక్ వినపడుతోంది.