సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ – 2 నిర్మాణ పనులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. 650 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్టప్రాంతాలు సస్యశ్యామలం అవడంతో పాటు తాగు నీటి అవసరాలు కూడా తీరుతాయని భ్వైస్తున్నారు.
సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశతో 46,453 ఎకరాలకు నీళ్లు అందనున్నాయి. ఇక నెల్లూరు జిల్లా నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. గత ప్రభుత్వమే దీనికి అంగీకారం తెలిపినా ఇప్పటి దాకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులకుతోడు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.