కేంద్ర బృందంతో భేటీ కానున్న జగన్

-

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కేంద్ర బృందంతో భేటీ కానున్నారు. ఇప్పటికే రెండు రోజులు పాటు కేంద్ర బృందాలు వరద ప్రభావిత జిల్లాల్లో అని భావిస్తున్న మొత్తం ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వచ్చింది. ఈ గ్రామం లో వర్షాలు వరదల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ కి 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కేంద్ర బృందానికి ఏపీ ప్రభుత్వం నివేదించింది. ఈ రోజు కేంద్ర బృందంతో ఏపీ సీఎం జరిపే భేటీలో కూడా ఇదే అంశాలను ప్రస్తావించినున్నట్లు భావిస్తున్నారు.

వీలైనంత త్వరగా ఈ సాయం అందించేలా కేంద్రంతో మాట్లాడాలని జగన్ కోరనున్నట్లు సమాచారం. తక్షణ సాయంగా 840 కోట్లు దాకా విడుదల చేయించమని జగన్ కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పట్లో కేంద్రం నుండి సాయం అందుతుందని చెప్పలేం. ఎందుకంటే తెలంగాణాలో కేంద్ర బృందం పర్యటించి చాల రోజులు జరిగినా ఇప్పటికీ కేంద్రం ఎటువంటి సాయం విడుదల చేయలేదు. మరి ఏపీకి రిలీజ్ చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news