ఏపీ రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ..మధ్యలో జనసేన ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని చెప్పి జగన్ ఇప్పటినుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు.
జగన్ సైతం సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుడు పేరుతో భారీ సభలతో ప్రజల్లోకి వెళుతున్నారు..అలాగే నియోజకవర్గాల వారీగా వన్ బై వన్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తు..దిశానిర్దేశం చేస్తూ..175కి 175 గెలవాలని, ఈ సారి గెలిస్తే మరొక 30 ఏళ్ళు మనదే అధికారమని అంటున్నారు..ఇక మనం అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాల కొనసాగింపు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు.
ఇక జగన్‌కు ధీటుగా చంద్రబాబు సైతం..ప్రజల్లో తిరుగుతున్నారు..టీడీపీని బలోపేతం చేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఇంకా ఎలా బలపడాలి, వైసీపీకి ఎలా చెక్ పెట్టాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కొందరికి టికెట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఇక బాబు సైతం బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. భారీ రోడ్ షోలు, సభలు పెడుతున్నారు. అటు ప్రజా సమస్యల విషయంలో పవన్, జనసేన నేతలు ప్రజలు తిరుగుతున్నారు.
అధికారంలోకి వచ్చే విషయాలో ఇంకా తమకు తిరుగులేదని జగన్ అనుకుంటున్నారు..రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తుందని, నెక్స్ట్ మనదే అధికారమని బాబు అంటున్నారు..ఇటు నెక్స్ట్ జనసేన ప్రభుత్వం వస్తుందని పవన్ అంటున్నారు. ఇలా ఎవరికి వారు అధికారంలోకి వచ్చే విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి 2024 ఎన్నికల్లో ఏ గాలి ఎక్కువ వీస్తుందో చూడాలి. అయితే అధికార బలంతో వైసీపీ ఉంది గాని, చంద్రబాబు, పవన్ రోడ్లపైకి వెళితే జనం భారీగానే వస్తున్నారు. ఇక వీరు గాని కలిస్తే ఫ్యాన్ గాలి తగ్గిపోతుందని చెప్పొచ్చు..లేదంటే ఫ్యాన్ గాలి ఉంటుంది.