ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. నేడు 3వ విడత ‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల చేయనుంది జగన్ సర్కార్. ఈ పథకం కారణంగా 3.30 లక్షల మందికి లబ్ది చేకూరనున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు నిధులు విడుదల చేయనుంది జగన్ సర్కార్. రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు జగన్ సర్కార్..ఈ పథకం ద్వారా ఆర్ధిక సహాయం చేస్తోంది.
ఇక ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 మంది లబ్దిదారులకు ఆర్ధిక చేయూత అందుకోనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో 330.15 కోట్లను వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్. పల్నాడు జిల్లా వినుకొండలో ఈ కార్యక్రమం జరుగనుంది.ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందించిన మొత్తం సహాయం రూ. 927.51 కోట్లుగా నమోదు అయింది. జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తోంది సర్కార్.