ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ గత ఏడాది రాష్ట్ర ప్రజల కోసం జగనన్న చేదోడు అనే పథకం తీసుకువచ్చారు. ఇప్పటికే పథకం ద్వారా ఒక సారి నగుదు పంపిణీ చేసిన ప్రభుత్వం మరో సారి లబ్ధి దారుల ఖాతాల్లో రూ. 10,000 జమ చేయడానికి సిద్ధం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణులను, రజకులను, దర్జీలను రెండో సారి ఆదుకోవడానికి జగనన్న చేదోడు అనే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణులకు, రజకులకు. దర్జీలకు ఆర్థిక సాయం చేయడం ముఖ్య ఉద్ధేశం. ఇప్పటికే జగనన్న చేదోడు పథకం ద్వారా రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజకులకు. దర్జీలకు ఈ ఏడాదే ఆర్థిక సాయం చేశారు.
మళ్లీ ఇప్పుడు రెండో సారి ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది నాయీ బ్రాహ్మణులకు, రజకులకు. దర్జీలకు రూ. 10 వేలు అందించనున్నారు. కాగ ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను, నిధులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాగ దీంతో రాష్ట్రంలో 1,46,103 మంది దర్జీలు, 98,439 మంది రజకులు, 40,808 మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ధి చేకురనుంది.