అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం అయింది. క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని.. ప్రైవేటు డైరీలు కన్నా.. ఎక్కవ రేటు ఇచ్చి అమూల్ పాలు కొనుగోలు చేస్తోందని వెల్లడించారు.
అమూల్ అతిపెద్ద సహకార సంస్థ అని.. పాల ప్రాససింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉందన్నారు. పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేస్తున్నారని.. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోందని వెల్లడించారు. లాభాలను కూడా బోనస్ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అమూల్ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరు గార్చారని.. ఉన్నా కొద్దీ, గొప్పో… ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లో ఉన్నాయన్నారు.
పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ రైతులు వచ్చి వాటర్ బాటిల్ చూపించేవారని… వాటర్ బాటిల్ ధర రూ.23లు అయితే, లీటరు పాలుకూడా అంతకన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. మినరల్ వాటర్‌కు ఇచ్చే రేటు కూడా పాలు పోసే రైతుకు, అక్క చెల్లెమ్మకు రాని పరిస్థితి అప్పుడు ఉండేదని.. గతంలో చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు పరిస్థితులు ఉండేవని వెల్లడించారు.