ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. రేపు జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమం… సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుండగా… వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు కూడా పాల్గొననున్నారు.
కాగా ఈ జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటిఐ విద్యార్థులకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ అలాగే పీజీ విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద 20000 రూపాయలు ఇస్తోంది ఏపీ సర్కార్.
ఇది ఇలా ఉండగా.. ఇవాళ పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండనుంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ జరుగనుంది.