Big Boss OTT Telugu: గేమ్ రసవత్తరం.. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ ఎత్తులు..ట్విస్ట్ ఇవ్వనున్న ‘బిగ్ బాస్’

-

‘బిగ్ బాస్’ ఓటీటీ రియాలిటీ షోలో గేమ్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. హౌస్ లో మోస్ట్ ఇరిటేటింగ్ సభ్యులుగా మిత్ర, నటరాజ్ మాస్టర్ లను సభ్యులు నామినేట్ చేశారు. ఆ టాస్క్ పూర్తి కాగానే ‘బిగ్ బాస్’ రోబో ఫ్యా్క్టరీ టాస్క్ ఇచ్చాడు. దాంతో ఇంటి సభ్యులందరూ అప్రమత్తమయ్యారు. ఎలాగైనా కెప్టెన్సీ దక్కించుకోవాలని కంటెస్టెంట్స్ డీల్స్ కుదుర్చుకుని ముందుకు సాగడం స్టార్ట్ చేశారు.

రోబో ఫ్యాక్టరీ టాస్క్ ‘బిగ్ బాస్’ నాలుగో సీజన్ లో నిర్వాహకులు పరిచయం చేశారు. ఆ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అఖిల్, అరియానా.. ఈ ‘నాన్ స్టాప్ ఓటీటీ’ షో లోనూ ఉండటం విశేషం. ‘రోబో ఫ్యాక్టరీ టాస్క్’లో భాగంగా అషురెడ్డి, అరియానా, బిందుమాధవి రోబో కంపెనీలుగా మారారు. మిగతా వారు సప్లైయర్స్ గా చేంజ్ అయ్యారు. టాస్క్ లో భాగంగా కంపెనీస్ ఎక్కువ రోబోలు అసెంబుల్ చేయాలి. సప్లైయర్స్ ఎక్కువ పార్ట్స్ దక్కించుకుని వాటిని కంపెనీలకు అమ్మి బిట్ కాయిన్స్ దక్కించుకోవాలి.

ఈ క్రమంలోనే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు కంటెస్టెంట్స్ ఎత్తులు వేయడం స్టార్ట్ చేశారు. ఎవరికి వారు డీల్స్ కుదుర్చుకుని ముందుకు సాగారు. హమీద ఈ సారి వెరీ స్మార్ట్ గేమ్ ఆడింది. ఇతరులతో డీల్స్ కుదర్చుకోవడంతో పాటు వారి వద్దనున్న కాయిన్స్ కొట్టేయడం చేసి ముందుకు సాగింది. అయితే, ఇప్పటి వరకు గేమ్ లో ముందున్న బిందు మాధవి ఇప్పుడు కొంత వెనక్కి తగ్గినట్లయింది. అయితే, రోబోల తయారీ విషయమై చివరలో ‘బిగ్ బాస్’ ట్విస్ట్ ఇచ్చే అవకాశాలుంటాయని పలువురు అంటున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో.. చివరకు కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు నిలుస్తారో..

 

 

Read more RELATED
Recommended to you

Latest news