టిడ్కోతో జగన్‌ సర్కార్‌ ఒప్పందం..2 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

-

అమరావతి : టిడ్కోతో జగన్‌ సర్కార్‌ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఇళ్ల నిర్మాణం కోసం ఏపీ టిడ్కో తీసు కోనున్న రూ. 5990 కోట్ల బ్యాంకు రుణానికి హామీ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – వైఎస్ఆర్ జగనన్న నగర్లలో మౌలిక సదుపాయాల కల్పన కింద రూ. 5990 కోట్ల రుణం తీసుకోనుంది ఏపీ టిడ్కో.

2,16,262 ఇళ్ల నిర్మాణం తో పాటు రహదారులు, డ్రెయినేజీల లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రుణం తీసుకోనుంది ఏపీ టిడ్కో. ఈ మొత్తాన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.

ఈ మొత్తాన్ని ఏడాదిలోగా వినియోగించు కోవాల్సిందిగా ఏపీ టిడ్కోకు సూచించింది జగన్‌ ప్రభుత్వం. రుణం తీసుకున్న కాలానికి ప్రభుత్వం హామీ ఉంటుందని స్పష్టం చేసింది. హామీ ఇచ్చిన మొత్తానికి రెండు శాతం కమిషనుగా చెల్లించాలని జగన్‌ ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news