ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ (samsung) ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఇంకో ఫోన్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎఫ్22 పేరిట ఆ ఫోన్ విడుదలైంది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఇన్ఫినిటీ యు సూపర్ అమోలెడ్ తరహా డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్‌లో రెండు సిమ్‌లు, ఒక మైక్రో ఎస్డీ కార్డును వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. వెనుక వైపు 48, 8, 2, 2 మెగాపిక్సల్ కెమెరాలు 4 ఉన్నాయి. ముందు వైపు 13 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ లభిస్తుంది. దీని వల్ల ఆడియో క్వాలిటీగా ఉంటుంది.
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. దీంట్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.12,499 ఉండగా, 6జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.14,499 ఉంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రీ ఆర్డర్లు చేసిన వారికి రూ.1000 డిస్కౌంట్‌ను ఇస్తారు.