ఈ లక్షణాలని అస్సలు అశ్రద్ధ చెయ్యద్దు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానం, ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు సరైన పోషక పదార్థాలు మనకి అందవు. పోషకాహార లోపం ఉందని మనకి ఎలా తెలుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ పోషకాహార లోపం ఉండడం వల్ల కొన్ని లక్షణాలు కనపడతాయి. ఒకవేళ కనుక అలాంటి లక్షణాలు కనపడితే అజాగ్రత్తగా ఉండద్దు. అయితే మరి పోషకాహార లోపం వలన కలిగే లక్షణాలు గురించి చూద్దాం.

bones
bones

జుట్టు ఊడిపోవడం:

కొన్ని కొన్నిసార్లు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జుట్టు ఊడిపోయింది అంటే ఐరన్ లోపం ఉందని గ్రహించాలి. రోజుకి వంద వెంట్రుకుల వరకు ఊడడం సహజం దీని కంటే ఎక్కువ ఊడితే ప్రమాదమని గ్రహించాలి. అదే విధంగా నీరసంగా ఉండడం, అలసిపోవడం కూడా ఐరన్ లోపం అని గ్రహించాలి. ఇలాంటి లక్షణాలు కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా తీసుకోండి.

బాగా బరువు తగ్గిపోవడం:

బాగా బరువు తగ్గిపోవడం కూడా పోషకాహార లోపం అని తెలుసుకోండి. మన శరీరం మైక్రో న్యూట్రియెంట్స్ మరియు మాక్రో న్యూట్రియంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కూడా పోషకాహార లోపం ఉందని గ్రహించాలి.

రేచీకటి:

రాత్రిపూట మీకు చూపు సరిగా లేదు అంటే పోషకాహార లోపం అని గ్రహించాలి విటమిన్ ఏ తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఇలాంటి లక్షణాలు కనబడితే అస్సలు అజాగ్రత్తగా ఉండకండి.

ఎముకల నొప్పి:

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి మరియు కాల్షియం ఉండాలి. మీకు కనుక ఎముకలు నొప్పి ఉంటే తప్పకుండా పోషకాహార లోపం అని గ్రహించండి. డాక్టర్ ని కన్సల్ట్ చేసి సరైన మందులు తీసుకోండి.

గాయాలు త్వరగా మానకపోవడం:

కొన్ని కొన్ని సార్లు గాయాలు ఏమైనా తగిలినప్పుడు అవి మానడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇలా కనుక జరిగితే పోషక పదార్ధాలు తక్కువగా ఉన్నట్లు గ్రహించాలి.

ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్:

రెగ్యులర్ గా గుండె కొట్టుకోకపోతే కూడా పోషకాహార లోపం అని గ్రహించాలి. కనుక వీటిని అశ్రద్ధ చెయ్యకుండా జాగ్రత్తగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news