రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి క్షమాపణలు !

-

రేవంత్‌ పై నిన్న జగ్గారెడ్డి మండిపడ్డ సంగతి తెలిసిందే. రేవంత్ ఒక్కడితో అంతా అయిపోదని.. అందరినీ కలుపుకుని పోవాలని ఫైర్‌ అయ్యారు జగ్గారెడ్డి. రేవంత్ తీరుపై సోనియా, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తానని.. నేను మాట్లాడేది తప్పు అయితే…రేవంత్ చేసేది కూడా తప్పేనని తెలిపారు. రేవంత్ లేనప్పుడు పార్టీ అధికారం లోకి రాలేదా ..? అని నిలదీశారు. జగ్గారెడ్డి వ్యవహారం పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయింది.

ఈ నేపథ్యం రంగం లోకి దిగిన అధిష్టానం.. జగ్గారెడ్డి, రేవంత్ మధ్య వివాదం ముగిసేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే జగ్గారెడ్డి కి సర్ది చెప్పారు ఏఐసీసీ ఇంచార్జి కార్య దర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్. అనంతరం నిన్నటి ఘటన పై వివరణ ఇచ్చారు జగ్గారెడ్డి. అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడటం పై సారి చెప్పారు జగ్గారెడ్డి.. నిన్నటి ఘటనను మరిచిపోవాలని.. అంతర్గత విషయాలు బయట మాట్లాడటం తన తప్పేనని పేర్కొన్నారు జగ్గారెడ్డి.. తన వైపు నుంచి తప్పు జరిగింది..మరోసారి అలా జరగదని వివరణ ఇచ్చానాన్నారు, తమ యుద్ధం టిఆర్ఎస్, బీజేపీ మీదేనని స్పష్టం చేశారు జగ్గారెడ్డి..

Read more RELATED
Recommended to you

Latest news