చిత్తూరు జిల్లా వైసీపీ లో మరో సారి విభేధాలు తెరపైకి వచ్చాయి. వైసీపి నేత, ఎమ్మెల్యే రోజా.. సొంత నియోజకవర్గం అయిన నగరి లో ఎంపిపి ఎన్నిక రగడ తలెత్తింది. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎంపీపీ ఎన్నిక లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయారు ఎంపీటీసీలు. ఓ వర్గం ఎమ్మెల్యే రోజా బలపరిచిన దీపను ఎంపిపి చేయాలని ప్రయత్నిస్తుండగా… రోజా ప్రత్యర్థి వర్గ0 అయిన రెడ్డివారి భాస్కర్ రెడ్డి ఎంపీపీ పదవి కోసం డిమాండ్ చేస్తున్నాయి.
నిన్న కోరం లేక ఇవాల్టికి వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ ఉదయం నుంచి మరోసారి ఎంపీపీ కార్యాలయంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పై నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అధికారులు మరియు , సొంత పార్టీ ప్రత్యర్థి వర్గం పైన ఎమ్యెల్యే రోజా చిందులు వేశారు. నిబంధనల ప్రకారం తాము బలపరిచిన అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించాలంటూ అధికారులతో వాదనకు దిగారు ఎమ్యెల్యే రోజా. అంతే కాదు తన ప్రత్యర్థి వర్గం మొత్తం టిడిపి కార్యకర్తలు అంటూ సొంత పార్టీ కార్యకర్తలతో గొడవ పడ్డారు ఎమ్మెల్యే రోజా. దీంతో ఎన్నికల అధికారులు తీవ్ర సందిగ్ధంలో పడ్డారు….