కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. హిజ్బల్ టాప్ కమాండర్ హతం.

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు మరో విజయం లభించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక ఉగ్రవాదిని జమ్మూ పోలీసులు మట్టబెట్టారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని అష్ముజీ ప్రాంతంలో శనివారం  భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదిని కుల్గామ్‌లోని మల్వాన్ గ్రామానికి చెందిన టాప్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ముదాసిర్ వాగేగా గుర్తించారు. అతను ఆగస్టు 2018 నుండి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నాడని,  పోలీసుల లిస్టులో A+ కేటగిరీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి ముందుగానే సమాచారంతో పోలీసులు, ఆర్మీ, CRPF దళాలు సంయుక్త బృందం కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. బలగాలు అనుమానిత స్థలాన్ని చుట్టుముట్టడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి

అంతకుముందు నవంబర్ 17న కుల్గామ్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో, భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఇందులో టిఆర్‌ఎఫ్‌కి చెందిన ఇద్దరు మరియు హిజ్బుల్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.