జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు టెర్రరిస్టుల హతం

జమ్మూ కాశ్మీర్లో  వరసగా ఎన్ కౌంటర్లు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువ కావడంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సీఆర్ఫీఎఫ్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను సీరియస్ గా తీసుకుంటున్నాయి. దీంతో వరసగా ఎన్ కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి జమ్మూకాశ్మీర్ లో తుపాకులు గర్జించాయి. ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టు పెట్టాయి. ఈ ఎన్ కౌంటర్ శ్రీనగర్ లోని రాంభాగ్ లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అంతమయ్యారు. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు ది రిసిస్టెంట్ ఫోర్స్(టీఆర్ఎఫ్) కు సంబంధించిన వారిగా గుర్తించారు. రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తుంది.

గతంలో కాశ్మీర్ లో జరిగిన పలు ఘటనల్లో ఈ రెసిస్టెంట్ ఫోర్స్ పేరు వినిపించింది. కాశ్మీర్ లో హైబ్రిడ్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులక తెగబడుతోంది. గతంలో కాశ్మీర్ లో నాన్ లోకల్స్ ను చంపిని ఘటనల్లో ఈ సంస్థే కీలకంగా వ్యవహరించింది.