అఫీషియల్: ‘జనగణమన’లో పూజా హెగ్డే..షూటింగ్ షురూ

-

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన డ్రీమ ప్రాజెక్ట్ షూటింగ్ ‘జనగణమన(JGM)’ షూటింగ్ స్టార్ట్ చేశాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్లే చేయనున్నది.

ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా షూటింగ్ స్టార్ట్ అయినట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. నిజానికి ఈ ప్రాజెక్టు ను పూరీ జగన్నాథ్ మహేశ్ బాబుతో చేయాలి. కానీ, ‘లైగర్’ తర్వాత ఇమీడియెట్ ప్రాజెక్టు విజయ్ దేవరకొండతో అనౌన్స్ చేశాడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ.

మిలిటరీ నేపథ్యంలో స్టోరి ఉండబోతున్నదని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పైన డైరెక్టర్ వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news