పోసాని కృష్ణ మురళి పై మరో కేసు !

పవన్ కళ్యాణ్ మరియు సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి మధ్య ఇటీవల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పవన్ కళ్యాణ్ చాలా మంది మహిళలను మోసం చేశాడని ఆరోపణలు చేశారు పోసాని. ముఖ్యంగా.. పూనం కౌర్ ఈ విషయాన్ని ఎత్తి చూపారు పోసాని కృష్ణమురళి.

దీంతో పోసాని కృష్ణ మురళి పై పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన నాయకులు చాలా సీరియస్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఈ రోజే పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేశారు జనసైనికులు. అయితే ఈ ఘటన జరిగి పది రోజులు కావస్తున్నా… పోసాని కృష్ణ మురళి ని వదలడంలేదు జనసైనికులు.

తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళి పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు సైకో అంటూ చేసిన వ్యాఖ్యలపై మనస్తాపం చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ ఫ్యాన్స్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు జనసైనికులు. పోసాని పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.