సత్యాగ్రహి సినిమా పక్కన పెట్టి ఆయనలా జీవిస్తున్నా : పవన్ కళ్యాణ్

లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తి పోస్ట్ చేశారు. జయప్రకాశ్ నారాయణ్ ప్రభావం జనసేన ఐడియాలజీ పై ఎంతో ఉందన్నారు. ఆయన రచనలు ఆయన ప్రయాణం జనసేన కు ఆదర్శం అని అన్నారు. స్వాతంత్ర రాజ్యాంగ స్పూర్తిని జయప్రకాష్ నారాయణ్ పాటించారని.. ఆయన జయంతి సందర్భంగా జనసేన ఆయనకు సెల్యూట్ చేసిందని పేర్కొన్నారు.

అంతేకాకుండా లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీ సమయంలో చేసిన కృషి గురించి తాను ఒక సినిమాను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో 2003లో “సత్యాగ్రహి” సినిమాను ప్రారంభించానని చెప్పారు. కానీ నిజ జీవితంలో జయ ప్రకాష్ లా జీవించాలని అందరికీ ఆదర్శంగా నిలవాలని సినిమా పక్కన పెట్టేసా అని చెప్పారు. నటించడం కంటే ఆయనలా జీవించడం ఎంతో సంతృప్తినిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.