ప్రధాని మోడీ, కెసిఆర్ లను బొంద పెట్టాలి.. అప్పుడే అంతటా శాంతి : రేవంత్ రెడ్డి

యూపీ లో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేశారని… మోదీ, కేసీఆర్ ను బొందపెడితేనే దేశంలో రాష్ట్రంలో శాంతి ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి. యూపీ ఘటన ను నిరసిస్తూ ధర్నాచౌక్ వద్ద టీపీసీసీ మౌన దీక్ష నిర్వహించింది. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాలు
రైతుల హత్యలను ఖండించి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దీని పై మోడీ అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80శాతం మంది రైతుల సమస్య అని పేర్కొన్నారు. 80 కోట్ల మంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారని.. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారని ఫైర్ అయ్యారు.

రైతులు తిరగబడి ఎర్రకోట పై జెండా ఎగరేశారని.. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పి.. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ కు చలిజ్వరం పట్టుకుందని మండిపడ్డారు.. శాంతి భద్రతలు కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కొడుకే రైతులను కారుతో తొక్కించి చంపారని.. ప్రధాని మోడీ.. దేశ ప్రజల మన్ కీ బాత్ వినాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి మోడీకి లొంగిపోయారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.