తెలంగాణ‌పై జ‌న‌సేన ఫోక‌స్..ఈ నెల 9న కీల‌క స‌మావేశం..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ రాకీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ప‌వ‌న్ తెలంగాణ రాజ‌కీయాల్లోనూ దూకుడు పెంచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ జనసేన పార్టీ బలోపేతం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు.
అంతే కాకుండా ఈనెల 9వ తేదీన హైదరాబాద్ లో జనసేన తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశం కానుంది.

తెలంగాణలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై ఈ స‌మావేశంలో ప్రధాన చర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా జనసేన పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరిస్తున్న ఈ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పవన్ భేటీకి ప్రాధాన్యత సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల కొన్ని జిల్లాల్లో జ‌న‌సేన జిల్లా నాయ‌కులు కార్య‌క‌ర్తల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news