నిన్న రాజమండ్రి సిద్ధం సభలో చెప్పు చూపించిన రాజమండ్రి ఎంపీ భరత్ కు టిడిపి, జనసేన కౌంటర్ ఇచ్చారు. ఎంపీ భరత్ కి బెల్టు చూపించారు జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కామెంట్స్ మాట్లాడుతూ ఎంపీ భరత్ ని నాకు కుమారుడు సమానంగా భావిస్తాను చెప్పుతీస్తే గొప్పవాడిని అయిపోతానని అనుకుంటున్నావా అన్నారు. వాలంటీర్ తో గౌరవంగానే మాట్లాడాను.
నా కుమారుడికి టికెట్ రావడంతో ఎంపీ భరత్ మతిపోయింది అని అన్నారు. భరత్ విషయాలు బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి అన్నారు. ఎంపీగా ఉండి ఆరు నియోజవర్గాలు గాలికి వదిలేసాడు. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎంపీ కి చెప్పు చూపిస్తారు. ఎంపీ మార్గాన్ని భరత్ ఫెయిల్యూర్ హీరో అన్నారు. రాజమండ్రిలో సినిమా సెట్టింగ్లు వేశారు అని అన్నారు.